ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు
04-06-2026 02:18 AM
కేసముద్రం, జూన్ 3 (విజయక్రాంతి): ఇనుగుర్తి మండలం చిన్న నాగారం ముత్యాలమ్మ తల్లికి కోమటిపల్లి గ్రామస్తులు బు ధవారం భారీగా తరలివచ్చి బోనాలను స మర్పించారు. మహిళలు తలపై బోనమెత్తి శి వసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల హోరు లో ఎడ్లబండ్లపై తరలివచ్చి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయంలోని శ్రీ ముత్యాలమ్మ, మారెమ్మ, పెద్దమ్మ తల్లులతోపాటు లోతుగుంట మైసమ్మ లకు బోనాలు, మొక్కులు చెల్లించి, తమ గ్రామాన్ని, పాడి పంటలు, ప్రజలను ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉంచాలని అమ్మవారలను వేడుకున్నారు.






