తరాల చరిత్రను మార్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
నాగిరెడ్డిపేట్,మే4 (విజయక్రాంతి): తరతరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారిన,ఎంతో మంది ఎమ్మెల్యేలు మారిన మండలంలోని తాండూరు గ్రామంలో నాలుగు వార్డు, ఐదవ వార్డులలో గల రోడ్లపై మురికి నీరు పారేది.వర్షం కాలంలో నడవడానికి వీలు లేకుండా ఉండేదనీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాలుగు,ఐదు వార్డు ప్రజల కష్టాలను బాధలను తీర్చాలని ఉద్దేశంతో నూతన సీసీ రోడ్లు నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షల నిధులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంజూరు చేశారని గ్రామ సర్పంచ్ యాదా గౌడ్ తెలిపారు.
4,5 వార్డుల ప్రజలకు కష్టాలకు గుర్తించి తలరాత చరిత్ర మార్చి నూతన సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు గ్రామ సర్పంచ్ యాదవ్ గౌడ్తో పాటు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగౌడ్,ఉప సర్పంచ్ అభిషేక్,గ్రామస్తులు ప్రభాకర్, మధు,వేముల సంగయ్య, లింగం,రమేష్ తదితరులు ఉన్నారు.






