30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

08-06-2025 10:08 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(61) (MLA Maganti Gopinath) కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన గోపీనాథ్ ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చించారు. కార్డియాక్ అరెస్టుకు గురైందని, సీపీఆర్ చేయడంతో తిరిగి కొట్టుకోని నాడి, బీపీ సాధారణ స్థితికి వచ్చాయి. దీంతోపాటు గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మూడు నెలలుగా ఏఐజీ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అప్పట్లో డయాలసిస్ చేయించినట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. 

మూడుసార్లు ఎమ్మెల్సేగా.. 

మాగంటి గోపీనాథ్ జూన్ 2, 1963న హైదర్‌గూడలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు స్ఫూర్తితో గోపీనాథ్ 1982లో టీడీపీలో చేరారు. 1985 నుండి 1992 వరకు హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. గోపీనాథ్ 2014, 2018, 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మొదట 2014లో తెలుగుదేశం పార్టీ (TDP) టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. తరువాత, ఆయన భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిపొందిన ఆయన తాజాగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్‌ను ఓడించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.