21 July, 2026 | 9:35 AM

సర్ తోనే ఓటర్ గా గుర్తింపు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

20-07-2026 09:50 PM

చొప్పదండి,(విజయక్రాంతి): సర్ తోనే ఓటరుగా గుర్తింపు పొందడానికి అర్హత సాధించవచ్చు అని, చొప్పదండి నియోజకవర్గం లో ఇప్పటికే 80% సర్ ప్రక్రియ పూర్తయినట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం మధురానగర్ లో సోమవారం స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. బిఎల్వోల ద్వారా ఇప్పటికే గ్రామాల్లో ఎనీమరేషన్ ఫారాలను అందజేసినట్లు తెలిపారు. ప్రజలు సకాలంలో ఏన్యుమరేషన్ ఫారాలను నింపి బిఎల్వో లకు సహకరించాలని సూచించారు.