28 August, 2026 | 11:18 PM

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మల్లారెడ్డి

28-08-2026 10:16 PM

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ అందజేత

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ జవహర్‌నగర్ సిపిఐ కాలనీకి చెందిన సంకోజు గణేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిన్నోజు సుధాకర్ చారి, బాధిత కుటుంబ పరిస్థితిని మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయమై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ,2,00,000/- (రెండు లక్షల రూపాయల) విలువైన ఎల్ఓసిని మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ఓసి పత్రాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిన్నోజు సుధాకర్ చారి నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి అందజేశారు. కష్టకాలంలో తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి, అలాగే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సాయం అందేలా చూసిన సుధాకర్ చారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాధవ్, కేశవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.