10 August, 2026 | 9:01 PM

Breaking News

వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ   •   గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి   •   బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసన   •   సంజయ్‌ని కలిసిన బిజెపి జిల్లా అధ్యక్షులు   •   ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్‌కు ఘన సన్మానం   •   రామప్ప సరస్సు నీటితో గణపసముద్రం నింపండి   •   మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తల్లికి పద్మాదేవేందర్‌రెడ్డి నివాళి   •   ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఆఫ్రిద్‌ను పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి   •   నిండు కుండగా మారిన ఎల్లయ్య చెరువు   •   తుంగతుర్తి పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులుగా పోతురాజు, బాణాల   •  

పోలీస్ ఉద్యోగాల కోసం 2 నెలల ఉచిత శిక్షణ

10-08-2026 07:51 PM

- ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు 

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలైలో నిరుద్యోగులకు 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లను విడుదల చేయగా యువతకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమ వారం తన నివాసంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన యువత పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులను స్కానర్ రూపంలో ఈ నెల 16 వరకు ఫామ్ పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న యువతకు పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద గల టీటీడీ మండపంలో ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు, పుస్తకాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు.

రెండు నెలల పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. అదే విధంగా మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ యాడ్ లో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్ సంస్థ) ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. తొలుత టిఫిన్ పంపించడం జరుగుతుందని, ఆ తర్వాత దసరా వరకు మధ్యాహ్న భోజనం పంపిణీ ఉంటుందన్నారు.

దసరా తర్వాత చెన్నూర్ లో అమలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మినహా పాఠశాల, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఈ భోజనం,  టిఫిన్ పథకం వర్తిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్ లు తనను విడిచి వెళ్తారని ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీలో  విభేదాలు ఉన్నట్లు ప్రజల్లో అపోహ సృష్టించాలనుకునే బీఆర్ఎస్, బీజేపీ  నాయకులకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.