10 August, 2026 | 9:05 PM

Breaking News

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ ఫేస్-I లో ఘనంగా బోనాల సంబరాలు   •   వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ   •   గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి   •   బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసన   •   సంజయ్‌ని కలిసిన బిజెపి జిల్లా అధ్యక్షులు   •   ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్‌కు ఘన సన్మానం   •   రామప్ప సరస్సు నీటితో గణపసముద్రం నింపండి   •   మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తల్లికి పద్మాదేవేందర్‌రెడ్డి నివాళి   •   ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఆఫ్రిద్‌ను పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి   •   నిండు కుండగా మారిన ఎల్లయ్య చెరువు   •  

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి

10-08-2026 07:55 PM

బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి

అక్కన్నపేట,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి మాచర్ల కుమారస్వామి పిలుపునిచ్చారు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి జాతీయ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలకు సూచించారు. అక్కన్నపేట మండలంలో సర్ ప్రక్రియ దాదాపు 100 శాతం పూర్తయిందని, మిగిలిన ఫారాలను బి ఎల్ ఓ లతో మాట్లాడి పూర్తి చేయించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్, సాంకే సంతోష్, కార్యదర్శులు వేముల ప్రసాద్, జన్నారపు కళ్యాణ్ విష్ణు, లావుడ్య రైనా నాయక్, వివిధ మోర్చాల అధ్యక్షులు ఇరుగుదినుల రాజకుమార్, మాలోత్ రాజునాయక్, గేరుమల రాజు, గంగుల కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు సలేంద్ర తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ జంగపల్లి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.