8 May, 2026 | 5:54 AM

తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే మందుల సామేలు కొండంత అండ

16-09-2025 11:58 PM

నాగారం: తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే మందుల సామెల్ కొండంత అండ అని  నాగారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  కన్నెబోయిన  వెంకట బిక్షం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు నాగారం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. 

మాట్లాడుతూ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఒక్క ఇళ్ల కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే నిరుపేదలకు సొంతింటి కలను సకారం చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ, రైతు బరోసా, ఉచిత విద్యుత్, ఫ్రీ బస్సు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు.