8 May, 2026 | 5:05 AM

మైనార్టీ గురుకులాల టైం టేబుల్‌లో మార్పు

17-09-2025 12:00 AM

సీఎంకు కృజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మైనార్టీ గురుకులాల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వం సవరించింది. టైమ్ టేబు ల్‌ను మార్చాలనే డిమాండ్  ఉంది.  ఇక నుంచి ఉదయం 9 గంటల నుంచి 9.15 వరకు పాఠశాల అసెంబ్లీ, ఫస్ట్ పీరియడ్ ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్నారు. లంచ్ బ్రేక్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు ఇవ్వనున్నారు.

ఈమేరకు రివైజ్డ్ టైమ్ టేబుల్‌ను మైనార్టీ గురుకులాల సెక్రటరీ షఫీ ఉల్లా జారీ చేశారు. గతంలో ఉదయం 8 గంటలకు తరగతులు ప్రారంభమయ్యేవి. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు భిక్షం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

గురుకులాల టైం టేబుల్‌ను సవరించకపోవడంతో ఉపాధ్యాయులు  ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ అంశాన్ని గతంలో సీఎం, ఆ శాఖ మంత్రి , గురుకులాల సెక్రటరీ షఫీ ఉల్లా దృష్టికి తీసుకెళ్లడంతో టైమ్ టేబుల్‌లో మార్పులు చేస్తామని తమకిచ్చిన హామీ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.