ఘనంగా ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూలై 14: తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు జన్మదిన వేడుకలు మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపెల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సామేలుకు స్వాగతం పలికారు.అనంతరం కాంగ్రెస్ అభిమానుల నడుమ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ నాయకులు, అభిమానులు,ప్రజలు తనపై చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందుర్తి వెంకట్ రెడ్డి,కార్యదర్శి వేల్పుల రమేష్,మాజీ డీసీసీబీ చైర్మన్ బీరవోలు సోమిరెడ్డి,కొర్రపిడత అవిలయ్య, వీరస్వామి, విక్రంరెడ్డి, విద్యాసాగర్, జలేంధర్, సైదులు, దల్వాయి శ్రీధర్, మహారాజు, సోమయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






