20 May, 2026 | 5:23 PM

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే

20-05-2026 04:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, బనస పెళ్లి మాజీ పీఏసీ ఎస్ చైర్మన్ రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, పార్టీ నేతలు అనుముల భాస్కర్ రాజేశ్వర్ తదితరులు మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో హడావుడిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు మొక్క కొనుగోలు కేంద్రాలు జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ఆ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పేరుకుపోయిన ఎందుకు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

ధాన్యం రైతులపై ఎమ్మెల్యేకు శుద్ధి లేదని రైతులు ప్రతిరోజూ కొనుగోలులో ఇబ్బంది పడుతుంటే ఆయన హైదరాబాదులో ఉంటూ అధికారం తిడుతున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న ఎమ్మెల్యే నిర్మల్ నియోజకవర్గంలో ఆయన రైతులకు ఏం చేసింది లేదని విమర్శించారు. ఎమ్మెల్యే వైఖరి కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలిపారు. ఎక్కడైనా ఎమ్మెల్యే తమ బుద్ధి మానుకొని రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.