ఎమ్మెల్యే నాయిని ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ పూర్తి
హనుమకొండ, జూన్ 26 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యుల ఓటరు వివరాల ఎన్యూమరేషన్ ప్రక్రియను అధికారులు శుక్రవారం పూర్తి చేశారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో నిర్వహించిన ఈ ప్రక్రియలో అధికారులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించి నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఎంఆర్‌ఓ రవీందర్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ (ఎన్నికలు) విఠలేశ్వర్, ఆర్‌ఐ దశరథ్ రామ్ రెడ్డి, స్థానిక బీఎల్వో సరస్వతి పాల్గొని అవసరమైన వివరాలను నమోదు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల మేరకు కొనసాగు తోందని అధికారులు తెలిపారు. ఓటర్లంద రూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు.






