ఎమ్మెల్యే మేనకోడలు సస్పెన్షన్

17-09-2026 | 05:25am
  1. ప్రభుత్వ వైద్య విధులకు డుమ్మా.. ప్రైవేట్‌లో పీజీ.. 
  2. నెలనెలా 70వేల వేతనం..
  3. వేటు వేసిన అధికారులు

బెంగళూరు, సెప్టెంబర్ 16: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే(Karnataka Congress MLA) ఉమేశ్ మేటీ మేనకోడలు డాక్టర్ అంకిత యారగల్ నమ్మ క్లినిక్‌(Ankitha Yaragal Namma Clinic)లో పనిచేస్తూ.. విధులకు హాజరుకాకుండానే రూ.70వేలు వేతనం అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్(suspended) చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆమెను సెప్టెంబర్ 2025న నియమిస్తే విధులకు హాజరు కాకుండా మోసానికి పాల్పడిందని విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

అంకిత మార్చి 3 నుంచి ఇప్పటివరకు విధులకు హాజరు కాలేదని, ఓ ప్రైవేటు కాలేజీ(Private college)లో పీజీ చదువుతోందని గుర్తించి తొలిసారి నోటీసులు జారీ చేశారు. ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో బుధవారం మరోమారు జిల్లా పంచాయతీ సీఈవో గజానన బాలే(District Panchayat CEO Gajanan Bale) విచారణ కోసం సెప్టెంబర్ 18న జీపీ కార్యాలయానికి రావాలని తుది నోటీసులను జారీ చేశారు.

ఆమె విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించామని, వేతనం రికవరీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వృత్తిపరమైన నియామావళిని ఉల్లంఘించినందుకు కర్ణాటక మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కమిషన్‌లకు ఫిర్యాదు చేయాలని కూడా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు