4 August, 2026 | 1:09 PM

శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ

04-08-2026 11:59 AM

కోటంచ లక్ష్మీ నరసింహ స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

భూపాలపల్లి,(విజయక్రాంతి): రేగొండ మండలం కొడవటంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఆగస్టు 13 గురువారం నుండి సెప్టెంబర్ 11 శుక్రవారం వరకు నెల రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రావణమాస ఉత్సవాలలో నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, పున్నం రవి, ముల్కనూరి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.