లాల్ సింగ్ తండాలో ఘనంగా తీజ్ వేడుకలు
04-08-2026 11:56 AM
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం లాల్ సింగ్ తండాలో తీజ్ పండుగ చివరి రోజు వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. గిరిజన మహిళలు తీజ్ బుట్టలతో ఊరేగింపుగా వెళ్లి మేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. దప్పుల మోతలు, డీజే పాటల మధ్య మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్థులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో తండాలో ఆధ్యాత్మిక, ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది






