4 August, 2026 | 1:02 PM

వెంకటేష్ కురుమ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

04-08-2026 12:15 PM

ఉప్పల్,(విజయక్రాంతి): బీజేపీ జనరల్ సెక్రటరీ, ఉప్పల్ జోన్ కురుమ యువత అధ్యక్షుడు గొరిగే వెంకటేష్ కురుమ అకాల మరణం పట్ల ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉప్పల్ కురుమ బస్తీలోని ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటేష్ కురుమ అకాల మరణం సమాజానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు.