4 August, 2026 | 1:15 PM

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం

04-08-2026 12:20 PM

- జాడి జమాల్పూర్ గ్రామస్తుల ప్రశంసలు

బోధన్,(విజయక్రాంతి): బోధన్ రోటరీ క్లబ్ సభ్యులు తమ నిత్యజీవితంలో వివిధ వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేసుకుంటూ కష్టపడి సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లు అందజేయడం అభినందనీయమని జాడి జమాల్పూర్ గ్రామస్థులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల బాలికల విద్యాభివృద్ధికి రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

అదేవిధంగా బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాడి జమాల్పూర్ గ్రామం తరఫున బోధన్ రోటరీ క్లబ్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్లవరపు సుందర్ రాజు, చిగురుపాటి వెంకటేశ్వరరావు, షేక్ మజార్ అలీ, పులి అంజి, కౌటిల్య, కాట్రగడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు.