బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
పాల్గొన్న ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ, జూలై 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పాత బాన్సువాడ సంగమేశ్వర కా లనీ శ్రీ జోడ్ కనకదుర్గా దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాడ మాసం పురస్కరించుకొని ఆ దివారం బోనాల పండుగ ఉత్సవాలను నిర్వహించారు. ఈ బోనాల పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొని, భాజా భజంత్రీలతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి దుర్గా మాత గుడిలో అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఎలినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించే లా చల్లగా చూడాలని అమ్మవారిని భక్తితో ప్రార్థించానని ఆయన పేర్కొన్నారు.
ఈసందర్భంగా ఆశాడమాస బోనాల పండుగ సందర్భంగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోతురాజులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.ఈ బోనాల పండుగ ఉత్సవాలలో బా న్సువాడ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






