calender_icon.png 22 July, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రభాకర్ పరామర్శ

22-07-2025 12:00:00 AM

కొండాపూర్, జూలై 21: కొండాపూర్ మండలంలోని మారేపల్లి, గంగారం, తమ్మలిభాయి తండా, హరిదాస్ పూర్ గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  పరామర్శించారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ వారి కుటుంబాలకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, తను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు విటల్, గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పాండురంగం, పీఏసిఎస్  చైర్మన్ రాజు, రుక్మొదిన్ , నాగయ్య, ఇంద్రారెడ్డి, రామచంద్రయ్య, మల్లా గౌడ్ ,మోహన్ గౌడ్, షఫీ, వినోద్, కుమార్ , అంజిరెడ్డి, ప్రభూ స్వామి, అంజిరెడ్డి, రవీందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.