calender_icon.png 22 July, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహంకాళి బండ్ల ఊరేగింపులో మాజీ మంత్రి హరీశ్ రావు

22-07-2025 12:00:00 AM

చేగుంట, జూలై 21 : చేగుంట పట్టణ కేంద్రంలో గల శ్రీ మహంకాళి అమ్మవారి రెండవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా డిష్ రాజ్  ఆధ్వర్యంలో నిర్వహించి, పలహార, బండి రథోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, తాజా మాజీ  జడ్పీటీసీ, సొసైటీల చైర్మన్లు,వైస్ చైర్మన్లు, తాజా మాజీ సర్పంచ్ పోరం అధ్యక్షులు, చేగుంట మండల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, యువకులు పాల్గొన్నారు.