12 March, 2026 | 4:09 AM

అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్స్ అందజేసిన ఎమ్మెల్యే

12-03-2026 12:36 AM

మహబూబాబాద్ ,మార్చి 11 (విజయక్రాంతి): మరిపెడ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులకు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల విద్యాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. చిన్న తనలోనే పిల్లలకు సరైన పోషకాహారం, విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తు బలపడుతుందన్నరు.

ప్రభు త్వం అందిస్తున్న యూనిఫాంలో చిన్నారుల్లో సమానత్వ భావనను పెంపొదించడ మే కాకుండా పాఠశాల పట్ల ఆసక్తిని కూడా పెంచుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి, మున్సిపల్ వైర్ చైర్మన్ కాలం సునీత,ఐసిడిఎస్ చైల్ ఆఫీసర్ ఎల్లమ్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.