19 May, 2026 | 2:36 AM

దివ్యాంగ విద్యార్థులకు అండగా ఉంటా..

19-05-2026 12:18 AM

సహాయక కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్కర్నూల్, మే 18 (విజయక్రాంతి): దివ్యాంగుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అందుకు తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో 81 మంది దివ్యాంగ విద్యార్థులకు 14 రకాల 108 సహాయక ఉపకరణాలు, కిట్లను పంపిణీ చేశారు. వీల్చైర్లు, హియరింగ్ ఎయిడ్స్, ట్రైసైకిళ్లు, వాకర్లు, విద్యా సామగ్రి తదితర ఉపకరణాలను విద్యార్థులకు అందజేశారు.

ఎమ్మెల్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్య సేవలు, పునరావాసం రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ నా విద్య కార్యక్రమం ద్వారా దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫిజియోథెరపీ, ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు.