18 July, 2026 | 8:30 PM

Breaking News

ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •   సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

18-07-2026 07:59 PM

కుబీర్,(విజయక్రాంతి): తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదలను ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. (KGBV)లో నాబార్డ్ (NABARD) నిధులతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులు మరియు అదనపు మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను, అలాగే రూ.42.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. విద్యార్థినులకు యూనిఫామ్ పంపిణీ చేశారు, విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ అభివృద్ధి పనులు ఎంతో ఉపయోగపడతాయని  ఎమ్మెల్యే పేర్కొన్నారు.