ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి
బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ఈ నెలాఖరి వరకు పూర్తి చేయాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు కోరారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల కార్యదర్శిలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 214 ఇండ్లను నిర్మించాల్సి ఉందని అందులో 100 ఇండ్లను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
ది బిజీ రాంజీ పథకంలో ఫాంపౌంట్స్ కుంటలు మ్యాజిక్ డ్రైవ్ వంటి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.మరుగుదొడ్లు కమ్యూనిటీ సానిటరీ బాత్రూంలో వివో భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడలు, అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మరుగుదొడ్ల పనులు మంజూరి ఐ ఉన్నందున వాటిని లబ్ధిదారులు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలని కార్యదర్శి లను కోరారు.






