ఉపాధ్యాయులకు ట్రాఫిక్, సైబర్ నేరాలపై అవగాహన
18-07-2026 07:56 PM
గజ్వేల్: సమగ్ర శిక్ష అభియాన్ కోర్స్ డైరెక్టర్ పి.అంజి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇన్-సర్వీస్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు ట్రాఫిక్, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డి. సత్యనారాయణ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. అలాగే ఆన్‌లైన్, ఓటీపీ, బ్యాంకింగ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా మోసాల నుంచి అప్రమత్తంగా ఉండే విధానాలను వివరించారు. ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.






