17 August, 2026 | 1:23 AM

బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే రంగారెడ్డి

17-08-2026 12:52 AM

గ్రామదేవతలకు పూజలు నిర్వహించిన మల్‌రెడ్డి రంగారెడ్డి 

అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు 16: మండల పరిధిలో వివిధ గ్రామాలలో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాలలో ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని అమ్మ వాళ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అబ్దుల్లాపూర్ లో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో  సందడిగా మా రింది. కవాడిపల్లిలో జరిగిన వేడుకల్లో  మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్ని  అమ్మవారికి పూజ లు నిర్వహించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్ డివిజన్ పరిధిలోని కుంట్లూరులో పోచమ్మ బోనాలకు హాజరైన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆలయం వద్ద హైమాస్ట్ లై ట్లను ప్రారంభించారు.

అలాగే, తట్టిఅన్నారం  హౌజింగ్ బోర్డు కాలనీలో జరిగిన బోనాల్లో పాల్గొన్న రంగారెడ్డి భూగర్భ డ్రైనేజీ, చిల్ట్రన్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వదించాలని ఆయన ఆకాంక్షించారు.