లోపరహితంగా పీఓబీ జాబితా సిద్ధం చేయాలి
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
చేవెళ్ళ ఆగష్టు 17(విజయక్రాంతి): రెవెన్యూ శాఖ మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో చేవెళ్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవెన్యూశ్రీ చంద్రా రెడ్డి ఆదివారం పర్యటించారు. నిషేధిత ఆస్తుల (POB) జాబితాపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పాత POB జాబితాను అదనపు కలెక్టర్ పరిశీలించారు. గ్రామాల వారీగా వివరాలను సంబ ంధిత రెవెన్యూ రికార్డులతో సరిపోల్చారు.
ప్రతి ఆస్తికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణం గా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు పిఓబి అనవస ఉన్న జాబితా ఆస్తుల వివరాలు ఉండకుండా రికార్డుల ఆధారంగా పూర్తి స్థాయిలో ధృవీకరణ చేపట్టాలని సూచించారు. కేవలం కా ర్యాలయ రికార్డుల పరిశీలనకే పరిమితం కాకుండా, అవసరమైతే క్షేత్రస్థాయి తనిఖీలు చేసి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాక తుది జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు. పాత జాబితా, సవరించిన జాబితా మధ్య ఉ న్న వ్యత్యాసాలను పరిశీలించి, సంబంధిత దస్తావేజులు, రిజిస్టర్లు, రెవెన్యూ రికార్డులు ఇతర ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఎం ట్రీకి సంబంధించి సరైన ఆధారాలు ఉం డేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్ర భుత్వ భూములు, నిషేధిత ఆస్తులు మరి యు ఇతరాత్ర వివరాల విషయంలో అత్యం త జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. తుది POB జాబితా వాస్తవాలు, పకడ్బందీ రికార్డు పరిశీలన క్షేత్రస్థాయి ధృవీకరణ ఆధారంగా లోపరహితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో జాబితా తయారీ పురోగతిని సమీక్షించారు. అదనపు కలెక్టర్, నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసి తుది లోపరహిత POB జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చేవెళ్ళ ఆర్డీఓ పార్థసింహ రెడ్డి, రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






