24 August, 2026 | 11:39 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి

04-05-2026 12:03 PM

పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సోమవారం 37డివిజన్ ఆపరేటర్ మల్లెల స్వప్న కుమారి ఎమ్మెల్యే సాంబశివరావును కోరారు. గత 30 సంవత్సరాల నుండి డ్రైనేజీ వ్యవస్థ ను ఎవ్వరు పట్టించుకోలేదు. డివిజన్ లో ఇండ్ల మధ్యలో పెద్ద మురుగు కాలువ ప్రవహిస్తుందని దానిని పునర్ నిర్మాణం నకు కాలువ మరమత్తులకు నిధులు కేటాయించమని కొత్తగూడెం శాసన సభ్యులుని కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్ లోని రోడ్లు, డ్రైన్లకు నిధులు కేటాయించి సహకరించవలసిందిగా కోరారు.  రామాలయం నకు నూతన కమిటీని ఏర్పాటు చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని, షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలతో దేవాలయం అభివృద్ధి చేసుకోవచ్చని రామాలయం అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది. ఆమె వెంట బిఆర్ఎస్ నాయకులు మల్లెల రవిచంద్ర పాల్గొన్నారు.