రూ.34 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సామేలు శంకుస్థాపన
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూలై 24: మండల కేంద్రం అర్వపల్లిలో రూ.34 లక్షల వ్యయంతో చేపటనున్న పలు అభివృద్ధి పనులకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాల సమాఖ్య భవన నిర్మాణానికి రూ.10 లక్షలు,కేజీబీవీ పాఠశాలలో డ్రైనేజీ,సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి రూ.14 లక్షలు,కొత్తకుంట సమీపంలోని బతుక మ్మ ఘాట్ వద్ద రూ.పది లక్షలతో చేపట్టే సీసీ ఫ్లోరింగ్ పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో నిలబెడతారని అన్నారు.పార్టీ నాయకులు అంతా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా ముందుకు సాగాలని సూచించారు.కేజీబీవీ పాఠశాల వర్షాకాలంలో నీట మునిగే సమస్యను పరిష్కరించేందుకు పాఠశాల ఆవరణలో బేస్మెంట్ లెవెల్ మొరం పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని,పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.మండలంలో సర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్‌ఓలను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందుర్తి వెంకట్ రెడ్డి,డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి,స్థానిక సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్,మూసి చైర్మన్ అల్వాల వెంకటస్వామి,దాసరి సోమయ్య, జలంధర్, సైదులు, అవిలయ్య, మహారాజు, శ్రీధర్, చిక్కుల శేఖర్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎంఈఓ బాలునాయక్, ఎస్‌ఓ నాగరాణి, హెచ్‌ఎం మల్లేష్, సర్పంచులు లూనావత్ కృష్ణనాయక్, పాశం కరుణభాస్కర్ రెడ్డి, చెరుకు వెంకటమ్మ, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






