25 July, 2026 | 1:49 AM

భూగర్భ జలాల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

25-07-2026 12:19 AM

నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. నాగరాజు

నేరేడుచర్ల, జూలై 24: భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7, 8వ వార్డులలో వర్షపు నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలు పెరిగేలా చూడాలన్నారు. తదుపరి మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకించే విధా నా లు, ఇంటి వద్ద రూఫ్ టాప్ రెయిన్వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. భూగర్భ జలాల పెంపు, నీటి కొరత నివారణ, భవిష్యత్ తరా లకు నీటి వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

అదేవిధం గా డ్రైడే-ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ చర్యలను చేపట్టారు. డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీ షేక్ యాకూబ్ పాషా,మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.