ఉచిత పెరుగన్నం పంపిణీకి శ్రీకారం
ప్రతిరోజు 3 వేల మందికి అందించే లక్ష్యం
మిర్యాలగూడ ఎమ్మెల్యే బి ఎల్ ఆర్
మిర్యాలగూడ, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్‌ఆర్) ఆధ్వర్యంలో ఉచిత పెరుగన్నం పంపిణీకి శ్రీకారం చుట్టారు ప్రతిరోజు 3 వేల మందికి ఉచిత పెరుగన్నం పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే బిఎల్‌ఆర్ ప్రకటించారు.
వేసవి ఎండలు పురస్కరించుకొని నిత్యం 3 వేలమందికి ఉచిత పెరుగన్నం ప్యాకెట్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అన్ని కుల సంఘాల, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సభ అనంతరం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో న్యాయ బోజ్ - సహా పంక్తి భోజనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత, మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, డి.ఎస్.పి రాజశేఖర్ రాజు,ఎంవిఐ చంద్రశేఖర్ గౌడ్, రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, మాల మహానాడు నాయకులు డాక్టర్ రాజు, తాళ్లపల్లి రవి, అధికారులు, అన్ని కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, బిఎల్‌ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.






