ఘనపూర్ ఆయకట్ట వద్ద గంగామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
కొల్చారం: ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్ట వద్ద నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బుధవారం గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని గంగామాతను ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ప్రకృతి సహకారం ఎంతో అవసరమని, ఈ ఏడాది రైతులకు మంచి పంటలు పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాబన్నగారి రవితేజ రెడ్డి, యువత అధ్యక్షుడు తునుకులపల్లి సంతోష్ రావు,తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు,పోతంశెట్టిపల్లి యాదగౌడ్,ఉప సర్పంచ్ అరె రవీందర్, సురేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి సిద్ధిరాములు,రాములు, నరేందర్ రెడ్డి, వేమారెడ్డి, కొంగోడ్ సర్పంచి స్వామి, తదితరులు పాల్గొన్నారు.






