రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే వేడుకలు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో బుధవారం వ్యాస గురు పౌర్ణమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి బ్లూ కలర్ డే ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రంగుల యొక్క ప్రాముఖ్యత, వాటిని గుర్తించే విధానాన్ని చిన్ననాటి నుండే పిల్లలలో విశ్లేషణాత్మక ధోరణిని అలవర్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజాబాబు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నీలిరంగు దుస్తులు ధరించడం జరిగిందని, పాఠశాలలోని తరగతి గదులు పూర్తిగా నీలిరంగు బొమ్మలతో అలంకరించడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు సునంద నవిత స్వప్న శ్వేత రుక్మిణి రూప పీఈటి రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు.






