బీఆర్‌ఎస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్,(విజయక్రాంతి): మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav ) శనివారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. అమీర్‌పేట్ డివిజన్ పరిధిలోని బల్కంపేటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు మల్లయ్య గౌడ్ ఇటీవల గుండె చికిత్స చేయించుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేటలోని సన్‌రైజ్ అపార్ట్‌మెంట్‌లో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.మల్లయ్య గౌడ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, వనం శ్రీనివాస్, సుమిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




