11 April, 2026 | 3:54 PM

Breaking News

కొండమల్లేపల్లిలో డాక్టర్స్ అకాడమీని మూసివేయాలి   •   బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •  

పంటకు ట్యాంకరుతో నీరు

11-04-2026 02:17 PM

జనగామ, (విజయక్రాంతి): చెరువులు, కుంటల్లో నీరుందని, బోర్లు బాగానే పోస్తున్నాయని, యాసంగి గట్టెక్కుతామన్న ధీమాతో ఉన్న రైతన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందించాల్సి వస్తోంది.  జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన రైతు సంగెం కొమురెల్లి రెండు ఎకరాలలో వరి పంట వేశాడు.

పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి బోరు బందయింది. పంట పొట్టదశలో ఉండటంతో చూస్తూ ఊరుకోలేక నీటి ట్యాంకర్లను గత నెల రోజుల నుండి  రోజు కి వెయ్యి రూపాయల చొప్పున అద్దెకు తీసుకొని. దానితో పొలం తడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెట్టినప్పటికీ, సాగునీరు లేక పంట ఎండిపోయేలా ఉందని ఆయన తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.