భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ, వంశీచంద్‌రెడ్డి పరామర్శ
చారకొండ, ఏప్రిల్ 19: మండలంలోని గోకారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచి అంతిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల మృతి చెందగా.. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. భాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 38 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భాస్కర్ రెడ్డి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల మనిషిగా సేవలందించారని కొనియాడారు.
సర్పంచ్ గా, సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు బలరాం గౌడ్, మోతీలాల్ నాయక్, కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి, పీసీసీ లీగల్ కన్వీనర్ డేరంగుల శేఖర్, యువజన కాంగ్రెస్ నాయకులు తక్కళ్ళపల్లి శేఖర్, శ్రీనివాస్ యాదవ్, జేపల్లి సర్పంచ్ అమీనా అశోక్ నాయక్, నాయకులు బాలరాజు, పుల్లయ్య, జగత్ రెడ్డి, కొండల్, లింగాచారి, మాధవ్ రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.






