మహిళా బిల్లు పేరుతో బీజేపీ రాజకీయం
బిల్లులో ఓబిసి కోటా అమలు చేయాలి
డిసీసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ టౌన్, ఏప్రిల్ 19: మహిళా బిల్లు పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బిజెపి చెప్పడం హాస్యాస్పదంగా ఉండన్నారు. మహిళా సాధికారిత కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసినట్టు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఇప్పుడున్న 543 పార్లమెంట్ స్థానాలకు ఆనుగుణంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. మహిళా బిల్లులో ఓబీసి కోటా ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
టీపీసికి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ మాట్లాడుతూ మహిళా బిల్లు పేరుతో ప్రతిపక్ష ఇండియా కమిటీని ప్రజల ముందు బదనాం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికి బీజీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు.
టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది , ఈషాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతున్న విషయాన్ని ఎఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పలు సార్లు చెప్పడం జరిగిందన్నారు. మహిళలను మోసం చేసే విధంగా బిజెపి ప్రభుత్వం బిల్లుపై రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై బిజెపి ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. సమావేశంలో నాయకులు చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్ , రాముని యాదవ్, ఫయాజ్, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.






