13 April, 2026 | 4:29 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం

25-02-2026 02:32 PM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

షాద్‌నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్‌లో 26వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapally Shankar ) పాల్గోని ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంతో నిరుపేద కుటుంబాల సొంతింటి కళ సాకారం అవుతుందని తెలిపారు.

పట్టణంలో గ్రామాల్లో అన్ని విధాలుగా సర్వే చేసి గ్రామసభలు పెట్టి ఇందిరమ్మ కమిటీలు, అధికారుల పర్యవేక్షణలో ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా జరిగిందని, అర్హులైన పేదలకు అందరికీ విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.