25 February, 2026 | 5:45 PM

42శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు జరపాలి

25-02-2026 03:11 PM

దేవరకొండ,(విజయక్రాంతి):  బుధవారం దేవరకొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టున అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో 42% బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలి.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి చట్టబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్లు ఏర్పాటు చేయడానికి 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపి బీసీలకు న్యాయం చేయాలని  అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చొల్లేటి భాస్కరాచారి రెడ్డి కోటేశ్వరరావు పున్న వెంకటేష్ కడారి రాములు భీమగోని శివ గౌడ్ బొమ్మిడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు