నవ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
18-05-2026 04:31 PM
చిట్యాల, మే 18(విజయక్రాంతి ): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెర్వుగట్టుకు చెందిన నవ్య మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం పరామర్శించారు. నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య ఆదివారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ్య మృతి ఎంతో బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అండగా ఉంటామని పేర్కొన్నారు.






