calender_icon.png 14 August, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్ర కీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల

11-08-2025 12:00:00 AM

నకిరేకల్, ఆగస్టు 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఇంద్ర కీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని ఆదివారం  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారికి  వేదపండితులు ఆశీర్వచనం చేసి.

తీర్థప్రసాదాలు అందజేశారు.అమ్మవారి ఆశీస్సులతో నకిరేకల్ నియో జకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పున్న కైలాసనేత, నకిరేకంటి నరేందర్. తదితరులు పాల్గొన్నారు.