11-08-2025 12:00:00 AM
స్థానిక సంస్థల ఎన్నికలలో భాజపాని గెలిపించండి
జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు
గరిడేపల్లి, ఆగస్టు10, (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామపంచాయతీలకు నిధులు ఇచ్చే భారతీయ జనతా పార్టీనీ ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు.గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
65 ఏళ్ల దౌర్భాగ్య పాలనను తూలనాడుతూ నరేంద్ర మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాలు దేదీప్యమైన అభివృద్ధిని కొనసాగిస్తు.కాంగ్రెస్ చరిత్రను కాలరాస్తూ ఇంటింటికి అనేక సంక్షేమ ఫలాలు అందించిన ఘనత భాజపా ప్రభుత్వం దే అన్నారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాలకు ఎన్.ఆర్.జి.ఎస్ నుంచి సిసి రోడ్ల నిర్మాణం,మురుగు కాలువలు ఆధునీకరణ,స్మశాన వాటికలు.
డంపింగ్ యార్డ్లు,మైగ్రేషన్ షెడ్లు,రైతు వేదికలు,పాఠశాల ఆధునీకరణ వసతులు,క్రీడా ప్రాంగణాలు,పల్లె దావకానలు,ఎల్‌ఈడి బల్బుల విద్యుత్తు ఆధునీకరణ,గ్రామపంచాయతీ బిల్డింగులు,స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, ఉపాధి హామీ పనులు, ఇంటింటికి ఉచిత రేషన్ బియ్యం,ఉజ్వల గ్యాస్ యోజన,అంగన్వాడీలకి పౌష్టికాహారం,రైతులకు ఎరువులపై సబ్సిడీ,ఎకరాకు 6000 కిసాన్ సమ్మాన్ నిధి యోజన,మత్స్యకారులకు చేయూత బ్యాంకులు,పోస్ట్ ఆఫీస్ లలో ప్రజా ప్రయోజన అనేక స్కీములు ప్రవేశపెట్టి భారత జాతికి వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీకి యావత్ ప్రజానీకం అండగా నిలుస్తుంది అన్నారు.స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం తప్పదని ఆయన తెలిపారు.