28 July, 2026 | 1:20 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్త!

01-06-2026 07:59 PM

భద్రాచలం రాధా హాస్పిటల్ లో ఫెర్టిలిటీ సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకట్రావు

భద్రాచలం,(విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా ఎంతోమంది దంపతుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ, ఇప్పుడు రాధా హాస్పిటల్స్‌తో కలిసి భద్రాచలం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు మంచి చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన దంపతులకు, ఇకపై మీ భద్రాచలం లోని రాధా హాస్పిటల్ లో సోమవారం నుండి ప్రారంభమైనాయి. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు ఒయాసిస్ ఫెర్టిలిటీ వాహనాన్ని సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.

దీంతో ఫెర్టిలిటీ నాణ్యమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. భద్రాచలం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు పిల్లలు కలగడానికి అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సేవలను భద్రాచలంలో డాక్టర్ అలీనా శాంతి  అందించనున్నారు. మహిళల ఆరోగ్యం, గర్భధారణ సంరక్షణ మరియు పిల్లలు కలగడానికి అవసరమైన చికిత్సల్లో ఆమెకు మంచి అనుభవం ఉంది.

తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసేందుకు, ప్రేమతో కూడిన సేవలు, వ్యక్తిగత శ్రద్ధ మరియు ఆధునిక వైద్య సదుపాయాలతో ఒయాసిస్ ఫెర్టిలిటీ మరియు రాధా హాస్పిటల్స్ మీకు తోడుగా నిలుస్తాయని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆలీనా తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు తెల్లం వెంకటరావు మాట్లాడుతూ ఓయాసి స్ ఫెర్టిలిటీ మరియు రాధా హాస్పిటల్ భద్రాచలం వారిచే అధునాతన సౌకర్యాలుతో వైద్య సేవలు అందిస్తున్నందున పిల్లలు లేని దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.