calender_icon.png 16 January, 2026 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మోత్సవాలల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు

16-01-2026 05:22:25 PM

శ్రీ.మల్లికార్జున స్వామి వారి  బ్రహ్మోత్సవాలల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా  ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో శ్రీ.మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం  నాగవెల్లి పట్నాల మహోత్సవ  కార్యక్రమంలో  పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణా రావు ని ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, భక్తులు,మహిళలు  పాల్గొన్నారు...