జాజూస్ హోటల్‌ను సందర్శిచిన ఎమ్మెల్యే
16-06-2024 01:38 AM
సూర్యాపేట, జూన్ 15(విజయక్రాంతి): పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మించిన జాజూస్ హోటల్‌కు ఎలాంటి అనుమతి లేదంటూ శుక్రవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ టీం కూల్చివేసిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శనివారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం జాజూ హోటల్ కూల్చివేతన్నారు. ప్రజా ఉద్యమాలతో రాక్షస పాలనను అడ్డుకుంటామని చెప్పారు. రాజకీయ కక్షతోనే ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని విమర్శించారు. అధికారులు నిబంధనల ప్రకారం పని చేయాలని సూచించారు. ఆయనవెంట మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్‌ఎస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాశ్ తదితరులు ఉన్నారు.






