పోలీస్ ప్రజావాణి
03-08-2026 05:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీస్ ప్రజావాణి సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పరిధిదారులు ప్రజావాణిలో సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చి ఫిర్యాదు చేశారు. వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వెల్లడించారు.






