3 August, 2026 | 5:11 PM

6 నెలల్లో లింగాలఘణపూర్‌కు సాగునీరు

16-06-2024 01:41 AM
  • స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, జూన్ 15(విజయక్రాంతి): లింగాలఘణపూర్ మండలంలోని ప్రతీ గ్రామానికి ఆరు నెలల్లోనే సాగునీరు అందించేలా కృషి చేస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం లింగాలఘణపూర్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్ల నుంచి వచ్చే అన్ని కాల్వల మరమ్మతులు చేపట్టి యాసంగి లోపు ప్రతీ గ్రామానికి నీరు ఇస్తామన్నారు. జనగామ నుంచి జీడికల్, జీడికల్ నుంచి పల్లగూడ మీదుగా గుమ్మడవల్లి, కోడూరు నుంచి చీటూరు, సిరిపురం నుంచి లింగాలఘన్‌పూర్, కిష్టపురం నుంచి నేలపోగుల రోడ్లను త్వరలో పూర్తిచేస్తామన్నారు.