30 August, 2026 | 2:25 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

13-11-2024 12:41 PM

అనంతగిరి (విజయక్రాంతి): మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకాలను పరిశీలించిన అనంతరం ఏఏ రకాల ధాన్యంను కొనుగోలు చేస్తున్నారు, గన్నీ బ్యాగుల సరఫరా, ట్రాన్స్ పోర్ట్ ఎలా జరుగుతున్నదని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం లక్ష్మి, వివోఏలు మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.