12-08-2025 12:10:32 AM
పటాన్ చెరు, ఆగస్టు 11 : శ్రావణ మాసం పురస్కరించుకొని రుద్రారం గణేశ్ గడ్డ సిద్ధి వినాయకుని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వినాయకుని దర్శించుకొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై ఈవో లావణ్య, మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ మాజీ ధర్మకర్తలతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రుద్రారం పీఏసీఎస్ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటన్న, రాజు, హరిప్రసాద్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.