calender_icon.png 12 August, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు సర్కార్ అంగీకారం

12-08-2025 12:12:11 AM

  1. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు లబ్ధి 
  2. యాజమాన్యానికి టీఎంయూ కృతజ్ఞతలు

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపునకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. యాజమాన్యం నిర్ణయంపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

త్వర లో మిగిలిన ఉద్యోగులకూ చెల్లింపులు చేయాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. తమ సంఘం సెటిల్‌మెంట్ మొత్తాల చెల్లింపుపై అనేకసార్లు ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తులు అందజేసిందని గుర్తుచేశారు. యాజమాన్యం 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.